స్నేహా సొసైటీలో ఘనంగా గురుపూజోత్సవం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ  ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ (Sneha Society)  దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి ఉపాధ్యాయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలను నృత్యాలు పాడిన పాటలను తిలకించారు.

అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్నేహ సొసైటీ టీచర్ల ను శాలువలు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ టీచర్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో తెలియని దివ్యాంగ విద్యార్థులకు చదువు చెప్పడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన స్నేహ సొసైటీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మొదట ఇక్కడి మానసిక, అంద దివ్యాంగ విద్యార్థులను చూసినప్పుడు ఎలా తట్టుకోగలను వీరికి ఏ విధంగా చదువు చెప్పగలను అనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా పాఠశాల ప్రిన్సిపాల్, నిర్వాహకుల ప్రోత్సాహంతో చెప్తూ ముందుకు సాగడం సంతోషకర మన్నారు.

అనంతరం ఈ కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ టీచర్లు మాట్లాడుతూ.. అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా బాగుండి ఆర్థిక పరంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్ని ఉన్నప్పటికీ కూడాను సాధారణ విద్యార్థులను ఏ విధంగా చదువుతోపాటు క్రమశిక్షణ నేర్పేందుకు ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అలాంటిది స్నేహ సోసైటీలో ఉన్న దివ్యాంగ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో చదువుతోపాటు పాటలు పాడడం, నృత్యాలు చేయడం, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. భగవంతుడు శరీరానికి లోపం ఇచ్చి ఉండొచ్చు గాని వారిలో మేధోసంపత్తి అనేది చాలా దాగి ఉందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>