తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బీసీలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శలు గుప్పించారు. రేవంత్ నాయకత్వంలో బీసీలకు న్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ చేస్తున్నది చిత్తశుద్ధి లేని శివపూజ అంటూ చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి.. బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దాక పోరాడుతామని మాటిచ్చారు. బీసీల కోసం పోరాడే చిత్తశుద్ధి, ఎందూరమయినా వెళ్లే తెగువ బీఆర్ఎస్‌కే ఉన్నాయన్నారు. ‘‘2004లో కృష్ణయ్య(R Krishnaiah) గారిని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరకి వెళ్లి కేసీఆర్(KCR) మూడు విషయాలు చెప్పారు. ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి, రెండు జనాబాకి అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులు బాటు కల్పించాలి, మూడు చట్ట సభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని కేసీఆర్ అడిగారు. భారత దేశ స్థాయిలో ఈ మూడు అంశాల మీద మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లో చాటుకున్నాము’’ అని కేటీఆర్(KTR) అన్నారు.
Read Also: బీజేపీ ఆఫీసులో ఫైట్.. ఫొటోల కోసమే..

