తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతి(Rao Balasaraswathi) మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంతాపం తెలిపారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తను కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. .‘సతీ అనసూయ’ సినిమాలో తొలి పాటను పాడారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం సహా పలు భాషల్లో ఆమె 2000కుపైగా పాటలు ఆలపించారు. అదే సినిమాలో గంగ పాత్రలో తన నటనను కూడా కనబరిచారు.
Read Also: కేసీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదో చెప్పిన కవిత..

