హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో(BJP Office) వాతావరణం వేడెక్కింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణ ప్రకటించిన అక్టోబర్ 18న రాష్ట్రబంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరడం కోసం పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారీ ఘర్షణ నెలకొంది. బీజేపీ, బీసీ సంఘాల నేతలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారున. సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఫొటోల దిగే విషయంలో బీజేపీ, బీసీ నేతల మధ్య వాగ్వాదం రాజుకుంది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. రామచందర్ రావు(Ramchander Rao), కృష్ణయ్య(R Krishnaiah) ఎంత వారిస్తున్నా ఎవరూ వినిపించుకోకుండా కొట్టుకున్నారు. దీంతో వెంటనే సెక్యూరిటీ, ఇతర నేతలు కలుగజేసుకుని ఇరు వర్గాలను వేరు చేశారు.
Read Also: కేసీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదో చెప్పిన కవిత..

