epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇంద్రకీలాద్రిపై కీలక సంస్కరణలు..

కలం, వెబ్​ డెస్క్​ : విజయవాడ కనకదుర్గమ్మ (Kanaka Durga Temple) భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు కీలక మార్పులు చేశారు. దర్శనం, ప్రసాద పంపిణీ వ్యవస్థలో సమయాన్ని ఆదా చేసేందుకు.. అలాగే పారదర్శకత, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ సంస్కరణలు తీసుకొచ్చారు. రూ.500 ల అంతరాలయ దర్శన టికెట్​ తీసుకున్న భక్తులకు దర్శనానికి ముందే ఉచిత లడ్డు (Free Laddu) అందజేస్తారు. టికెట్​ పాయింట్ వద్దే పంపిణీ చేయడం వల్ల దర్శనం తరువాత వేరే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

పాయింట్​ వద్ద టికెట్​ స్కాన్​ అయిన వెంటనే భక్తులకు లడ్డు ఇచ్చే విధానం ద్వారా పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు దర్శన టికెట్ల దుర్వినయోగంను అరికట్టడానికి, ఆలయ ఆదాయ నిర్వహణలో జవాబుదారీతనం పెంచడం కూడా ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ఆలయంలో(Kanaka Durga Temple) భక్తుల రద్దీ నియంత్రణకు టెక్నాలజీని విస్తృతంగా అమలు చేస్తున్నారు.

Read Also: ఏపీలో 28 జిల్లాలు.. 82 రెవెన్యూ డివిజన్లు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>