భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ బంపర్ ఆఫర్

కలం, వెబ్ డెస్క్: భారత్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) శుభవార్త చెప్పారు. రైతులకు సరిపడా ఎరువులను ఎగుమతి చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎంత డిమాండ్ ఉన్నా వెంటనే సరఫరా చేస్తామని, భారత రైతుల ప్రయోజనాలకు రష్యా కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) మాస్కోలో రష్యా అధ్యక్షుడితో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా జైశంకర్, అధికారుల బృందాన్ని ఉద్దేశించి పుతిన్ మాట్లాడారు. ‘కాలపరీక్షలను తట్టుకుని దశాబ్ధాలుగా రష్యా–భారత్ సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సంబంధాలతో పాటు పార్లమెంటరీ సంబంధాలు, ఆర్థిక సహకార రంగాలకు ఈ బంధం విస్తరించింది. గతేడాది వాణిజ్యం కొంత తగ్గినా.. ఈ సంవత్సరం మాత్రం రెట్టింపు కావడం ఆనందంగా ఉంది. ఈ విషయంలో ప్రధాని మోదీ(PM Modi)కి నా ప్రత్యేక ధన్యవాదాలు. షాంఘై సహకార సంఘం సమావేశాల్లో భాగంగా మేం మరోసారి కలవబోతున్నాం’ అని స్పష్టం చేశారు.

చర్చలపై హర్షం..

భారత్–రష్యా సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల అధికారులు నిరంతరం చర్చలు జరుపుతుండటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) హర్షం వ్యక్తం చేశారు. రష్యా తరఫున ఉప ప్రధాని మంతురోవ్, భారత్ నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ అంతర్ ప్రభుత్వ కమిషన్ నిర్వహిస్తున్నారు. అణున శక్తి, సాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం స్థిరంగా కొనసాగుతోందని ప్రశంసించారు.

Also Read : సుప్రీం కోర్టుకు చేరిన‌ కేబీఆర్ పార్క్ కేసు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>