కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి తక్కడపల్లి ప్రతిభ (Athlete Pratibha) గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా మంత్రి తనను వేధించినట్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ ను సాయం కోరగా నీచంగా మాట్లాడినట్లు సైక్లిస్ట్ రంజిత్ ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా పని చేసిన శ్రీనివాస్ గౌడ్ దగ్గరకు వెళ్లి తన టూర్ కోసం సాయం చేయాలని కోరినట్లు రంజిత్ వీడియోలో వెల్లడించారు.
‘ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు టూర్ ప్లాన్ చేశానని.. దీనికి ప్రభుత్వం సాయం చేయాలని కోరా. దీనికి అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) నవ్వుతూ హేళన చేశాడు. నువ్వు సైకిల్ యాత్ర చేసినంత మాత్రానా సైకిళ్లు ఎవరు తొక్కుతారు?. నువ్వు పోతే నీ ఇంటికి ఎవరు దిక్కుగా ఉంటారు’ అని శ్రీనివాస్ గౌడ్ తనను చులకనగా మాట్లాడరని సైక్లిస్ట్ రంజిత్ వీడియోలో ఆరోపించారు.
శ్రీనివాస్ గౌడ్ మాటలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ క్రీడల మంత్రులు ఇలాగే ఉంటారు అంటూ.. క్రీడాకారిణి తక్కడపల్లికి సంబంధించిన ప్రోమో వీడియోను రీషేర్ చేస్తున్నారు.
BRS Sports Ministers Ante Anthe https://t.co/yxo3iCzwXz pic.twitter.com/nAzrMYGm8L
— Butta Ashwin Chandra 🇮🇳 (@Ashwin_Butta) August 23, 2026
Also Read : బీజేపీ ఎంపీపై నిరంతర నిఘా.. సంచలన ఆరోపణలు
Follow Us On: X(Twitter)

