కలం, వెబ్ డెస్క్: ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తలేరా? ట్యాపింగ్ నిజం అయితే అధికారులు ఏందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు’’ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. చిట్‌చాట్‌లో భాగంగా సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నాటి నెహ్రూ నుంచి నేటి దాకా ట్యాపింగ్ ఉందని ఆయన అన్నారు.
‘‘ఇప్పుడున్న డీజీపీలు కూడా అప్పుడు అధికారులుగా ఉన్నారు. సీఎం (CM Revanth Reddy) కూడా నిఘా వ్యవస్ధ గురించి తెలుసు. ఏవిధంగా నిఘా వ్యవస్ధ పనిచేస్తుందో సీఎం, అధికారులు చెప్పరు. వారికున్న నిబంధనల మేరకు ఏవిధంగా సమాచారం వస్తుందో సీఎం అడగరు. ఈ సిట్ వంటి డ్రామాలతో ఎన్ని రోజులు ప్రజల దృష్టిని తప్పిస్తారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎన్ని రోజులు కాలం వెల్లదీస్తారు. ఇన్ని సిట్‌లు విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటి. కనీసం ఒక్క దాంట్లో అయినా నిజం ఉందని తెలిందా’’ ? అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారు. అందుకే మాకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మాకు ఒటు వేశారు. కాంగ్రెస్‌కు పరిపాలన రాదాని తెలిపోయింది. కాంగ్రెస్ అప్పుల ప్రచారం కూడా ప్రజలు నమ్మడం లేదు. కాగ్ లెక్కలు నిజాల కూడా ప్రజలకు తెలుసు. ‘‘ GHMC ని ఈ సర్కార్ మూడు లేదా నాలుగు ముక్కలు చేస్తారని భావిస్తున్నాం. ఫోర్త్ సిటీ అని పెట్టాడు కదా దాన్ని కూడా ఏదో కార్పొరేషన్ చేస్తాడు కావచ్చు. ఏం చేసిన శాస్త్రీయంగా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకుంటారా అన్నింటికి సమాధానం చెప్పాలి. 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం’’ కేటీఆర్ అన్నారు.
ప్రాజెక్టులు ఎక్కడున్నాయో రేవంత్‌కు తెలియదు
‘‘ముఖ్యమంత్రి కృష్ణా నది ఎక్కడ ఉన్నది అడిగాడు. బాక్ర నంగాల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో తెల్వని ముఖ్యమంత్రి. పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్న వ్యక్తి.. ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారు. వీళ్ళు నీటిపారుదల శాఖపై చర్చ అంటున్నారు. దేనిమీద చర్చ పెడుతున్నారో తెల్వదు. నీటిపారుదల శాఖ పై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారు. కేసీఆర్ వస్తున్నాడు అని చర్చకు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మేడిగడ్డ బాంబులు పెట్టీ పేల్చారని అన్నాడు. బూతులు మాట్లాడాలి అంటే ఎన్ని రోజులైనా చర్చ పెడుతారు. సభలో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారు. చెక్ డ్యాం పేల్చివేత కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్నది. ఆనాడు మేడిగడ్డ పేల్చారు అని ఫిర్యాదు చేశారు ఇంజనీర్లు. ఎందుకు మీరు విచారణ చేపట్టడం లేదు. వాటర్ బాడీలను పేల్చితే టెర్రరిస్ట్ యాక్ట్‌తో సమానం. అలానే ఇక్కడ కాళేశ్వరం కూడా పేల్చారు అని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారు’’ అని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు
‘‘తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. సభలో కేసీఆర్ కలిసేంత సంస్కారం ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదే. నేను అంధ్రాలో చదివితే తప్పు.. కానీ అల్లుడు అంధ్ర నుంచి తెచ్చుకున్నారు’’ అని కేటీఆర్ (KTR) రేవంత్‌పై ఫైర్ అయ్యారు.
Read Also: మాక్కూడా పీపీటీకి ఛాన్స్ ఇవ్వండి.. స్పీకర్‌కు బీఆర్ఎస్ఎల్పీ వినతి
Follow Us On: Instagram


