epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

PSL 11 బ్రాండ్ అంబాసిడర్ ఖరారు

క‌లం వెబ్ డెస్క్ : పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(PSL) 1వ సీజన్ బ్రాండ్ అంబాసిడర్ ఖరారు అయ్యాడు. ఈ రోల్‌కు వసిమ్ అక్రమ్‌(Wasim Akram)ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఖరారు చేసింది. ఈ మేరకు పీసీబీ బోర్డ్ ఛైర్మన్ మొహ్‌సిన్ నఖ్వీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘వసీమ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పీఎస్‌ఎల్‌కి ఒక మంచి విషయం’’ అని నఖ్వీ అన్నారు. అంతేకాకుండా కొత్త జట్లకు బిడ్స్ వేసే సమయంలో వేలం ప్రక్రియను వసీం దగ్గరుండి పరిశీలిస్తాడని చెప్పారు. పీఎస్ఎల్ అభివృద్ధిలో వసీం పాత్ర చాలా ఉందని, కోచింగ్, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో వసీం తన మార్క్ చూపించుకున్నాడని వివరించారు.

PSL 11వ సీజన్ ప్రారంభ తేదీపై కూడా నక్వీ (Mohsin Naqvi) కీలక ప్రకటన చేశారు. ముందుగా ప్రకటించిన మార్చి 26కు బదులుగా, మార్చి 23 నుంచే టోర్నమెంట్ ప్రారంభమయ్యే అవకాశముందని చెప్పారు. అలాగే అండర్-19, పాకిస్థాన్ షాహీన్స్ జట్ల ప్రదర్శన మెరుగుపడటంలో ఆక్విబ్ జావేద్ పాత్రను ఆయన (Wasim Akram) ప్రశంసించారు. “ఆక్విబ్ జావేద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత షాహీన్స్, వయోపరిమితి జట్ల కోసం శిబిరాలు నిర్వహించాం. దీని ఫలితంగా ఈ జట్ల ప్రదర్శన నిరంతరం మెరుగుపడుతోంది” అని నక్వీ తెలిపారు.

యువతపై పెట్టుబడులు, ఇతర క్రీడల అభివృద్ధిపై కూడా PCB దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు. లాహోర్, ఫైసలాబాద్‌లలో పాఠశాల క్రికెట్ ఇప్పటికే పూర్తయ్యిందని తెలిపారు. ఇతర క్రీడలకు కూడా మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Read Also: లంకపై భారత్ జైత్రయాత్ర: నాలుగో టీ20లోనూ ఘనవిజయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>