కలం వెబ్ డెస్క్ : ‘ఉన్నావ్’ రేప్ కేస్(Unnao Rape Case) నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్(Kuldeep Singh Sengar)కు సుప్రీం కోర్ట్ షాకిచ్చింది. అత్యాచార కేసులో ఆయన శిక్షను రద్దు చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్ట్(Delhi High Court) ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నిందితుడి తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్ట్ నిందితుడి శిక్షను రద్దు చేస్తూ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించింది. సోమవారం సీబీఐ పిటిషన్‌ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెల్లడించింది.
2017 జూన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో జరిగిన ఈ అత్యాచార (Unnao Rape) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్‌దీప్ సింగ్ సెంగార్‌పై బాధిత యువతి అత్యాచార ఆరోపణలు చేసింది. కేసు నమోదు నుంచి దర్యాప్తు వరకు బాధితురాలికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కేసు కొనసాగుతున్న సమయంలో 2019 డిసెంబర్‌లో బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అత్యాచార కేసుతో పాటు బాధితురాలి తండ్రి మరణం కేసులు నిందితుడిపై ఉన్నాయి. 2019 డిసెంబర్ 16న ట్రయల్ కోర్ట్ కుల్దీప్‌ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. దీన్ని సవాల్ చేస్తూ నిందితుడు ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు.
Read Also: 2029లోనూ మోదీనే పీఎం.. కేంద్ర మంత్రి అమిత్ షా
Follow Us On: Youtube


