కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ హయాంలో ప్రతిదానికీ వాళ్ల కుటుంబ(గాంధీ–నెహ్రూ) సభ్యుల పేర్లే పెట్టారని ప్రధాన మంత్రి మోదీ (PM Modi) విమర్శించారు. దేశాభివృద్ధికి పాటుపడిన నేతలను, మహనీయులను ఆ పార్టీ విస్మరించిందని అన్నారు. తమ ప్రభుత్వం జాతీయ నాయకులను గౌరవిస్తోందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా గురువారం లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించి మాట్లాడారు.
‘కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు జాతీయ నాయకులను, మహనీయులను విస్మరించాయి. ప్రతి దానికీ ఒకే కుటుంబ సభ్యుల పేర్లను పెట్టారు. దేశమంతా వాళ్ల విగ్రహాలే ఏర్పాటుచేశారు. కానీ, దేశానికి నిస్వార్థ సేవలందించిన ఎంతో మంది జాతీయ నాయకులను మరచిపోయారు. ప్రతిపక్షాలతో సంబంధం ఉన్న మహనీయులను అగౌరవపరిచారు. కానీ, మా ప్రభుత్వం భరత జాతి ఐక్యతకు, అభివృద్ధికి త్యాగాలు చేసినవాళ్లను గుర్తిస్తోంది’ అని ప్రధాని పేర్కొన్నారు. కాగా, రూ.230కోట్లతో కమలం ఆకారంలో ప్రేరణా స్థల్ ఏర్పాటుచేశారు. ఇందులో బీజేపీ సిద్ధాంత కర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలను ఏర్పాటుచేశారు. జాతీయ నాయకుల చిత్రాలు, విశేషాలు తదితర వాటితో మ్యూజియం నిర్మించారు. విగ్రహాలకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ (PM Modi).. మ్యూజియాన్ని సందర్శించి, తిలకించారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కీలక సమావేశం
Follow Us On: Instagram


