కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)కు సంబంధించి విచారణను సిట్ (SIT Inquiry) వేగవంతం చేసింది. ఈ మేరకు దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ విచారణకు హాజరయ్యారు. గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నందకుమార్ ను సిట్ అధికారులు విచారించారు. తన ఫామ్ హౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆడియోలు బయటకు రావడంపై సిట్ అధికారులు నందకుమార్ ను ప్రశ్నించారు.
విచారణ అనంతరం నందకుమార్(Nandakumar) మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలోనే తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని సిట్ విచారణలో చెప్పానన్నారు. తాను స్వామీజీలు మాట్లాడుకున్న విషయాలను అప్పటి సీఎం కేసీఆర్ బహిర్గతం చేసిన అంశంపై విచారణ జరిగిందన్నారు. కేసు(Phone Tapping Case)కు సంబంధించి తనపై రాధా కిషన్ రావు అక్రమ కేసులు పెట్టారని నందకుమార్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై అప్పటి డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీస్ విచారణకు పూర్తిగా స్పందిస్తానని నందకుమార్ తెలిపారు.
Read Also: జాతీయ నాయకులను విస్మరించిన కాంగ్రెస్: ప్రధాని మోదీ
Follow Us On: Pinterest


