epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫోన్​ ట్యాపింగ్ కేసులో సిట్​ కీలక సమావేశం

కలం, వెబ్​ డెస్క్​ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్​ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్​ సిటీ సీపీ సజ్జనార్​ నేతృత్వంలో సిట్​ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి సిట్​ బృందంలోని కొంతమంది అధికారులు గురువారం సీపీ సజ్జనార్​ (CP Sajjanar) తో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఇంటలిజెన్స్​ చీఫ్​ విజయ్​ కుమార్​ కూడా హాజరయ్యారు. కేసు ప్రగతిపై, ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలపై సమీక్ష జరిపి, తదుపరి కార్యాచరణపై భేటీలో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్​, మాజీ డీజీపీని పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: ఢిల్లీ గ్యాస్​ ఛాంబర్​.. దేశ రాజధానిగా బెంగుళూరు బెస్ట్: వీడియో వైరల్​

Follow Us On: X(Twitter

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>