epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీ గ్యాస్​ ఛాంబర్​.. దేశ రాజధానిగా బెంగుళూరు బెస్ట్: వీడియో వైరల్​

కలం, వెబ్​డెస్క్​: దేశ రాజధాని ఢిల్లీ(Delhi) కాలుష్యం కోరల్లో చిక్కిచిక్కి విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. జనం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ గాలి పీల్చడం అంటే 20 సిగరెట్లు తాగిన దానితో సమానం అని అనేక రిపోర్టులు సైతం చెబుతున్నాయి. దీనిపై కోర్టులు మొటిక్కాయలు వేస్తున్నా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గడం లేదు. పైగా, రోజురోజుకూ వాయు నాణ్యత మరింతగా క్షీణిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే అక్కడ పాత వాహనాలను, డీజిల్​ బండ్లను నిషేధించారు. ఢిల్లీ పరిధిలోని తొమ్మిది టోల్​గేట్లను తొలగించాలని, నేషనల్​ హైవే అధికారులకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. దీనితోపాటు నేరాల విషయంలోనూ ఢిల్లీ నిత్యం టాప్​లోనే ఉంటోంది. ఈ క్రమంలో ‘దేశ రాజధానిగా బెంగళూరు బెస్ట్ (Bengaluru best) ​.. ఢిల్లీ వద్దే వద్దు’ అంటూ ఓ ఢిల్లీ అమ్మాయి మాట్లాడిన మాటల వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.

సిమృధి మఖీజా కంటెంట్​ క్రియేటర్, సొంతూరు ఢిల్లీ. సిమృధి దాదాపు రెండు నెలల నుంచి బెంగళూరులో నివసిస్తోంది. ఇటీవల తల్లిదండ్రులను కలవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు ఫైట్​ నుంచి దిగీదిగగానే విపరీతమైన దగ్గుతో ఇబ్బంది పడింది. దీంతో ఢిల్లీలో ఉండడం ఎంత నరకమో చెబుతూ వీడియో తీసి ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది. ‘ఢిల్లీలో ఉంటే గ్యాస్​ ఛాంబర్​లో ఉంటున్న ఫీలింగ్. ఇది ఇప్పటికీ దేశ రాజధానిగా ఎందుకు ఉందో అర్థం కావడం లేదు. బెంగళూరులో స్వచ్ఛమైన గాలి, మహిళలకు భద్రత ఉంది. రోడ్లు బాగున్నాయి. అదే, ఢిల్లీ(Delhi)లో పొల్యూషన్​, అన్​సేఫ్​ రోడ్స్​, నడవడానికి కూడా కష్టమైన దారులు. ఇలా ఉంటే విదేశీయులు ఢిల్లీలో పర్యటిస్తారా? వాళ్లకు అన్ని విధాలా బెస్ట్​ అయిన బెంగళూరు లాంటి మంచి నగరం కావాలి. దేశ రాజధానిగా బెంగళూరు బెస్ట్​’ అని ఆ వీడియోలో సిమృధి పేర్కొంది. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సరే తమ కుటుంబాన్ని బెంగళూరుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని, తల్లిదండ్రుల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని ఆమె చెప్పింది.

ఈ వీడియో వైరలవగా, చాలా మంది ఆమెతో ఏకీభవిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం, భద్రత విషయంలో సిమృధి చెప్పినవి నిజమంటున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ‘ఢిల్లీకి బదులు వేరొక సిటీని రాజధానిగా చేయమని చెప్పే బదులు ఒక కంటెంట్​ క్రియేటర్​గా ఢిల్లీ సమస్యలపై గొంతెత్తాల’ని సూచిస్తున్నారు. ‘గాలి, భద్రత విషయంలో ఓకే కానీ రోడ్ల విషయంలో మాత్రం ఢిల్లీనే బెస్ట్​. బెంగళూరు రోడ్లు నరకానికి దారుల్లా ఉంటాయి’ అని ఇంకొందరు అంటున్నారు. దీంతో ఈ వీడియోపై ఇప్పుడు సోషల్​ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది.

Read Also: బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు.. జాన్వీకపూర్ సంచలన పోస్ట్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>