epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు.. జాన్వీకపూర్ సంచలన పోస్ట్​

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో హిందువులపై దాడుల మీద బాలీవుడ్​ నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor)​ ఇన్​స్టాలో సంచలన పోస్ట్​ పెట్టారు.​ బంగ్లాదేశ్​లో జరిగింది అమానవీయమని, ఈ నరమేధాన్ని ప్రశ్నించాలని ఆమె కోరారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా తిప్పికొట్టాలన్నారు. బంగ్లాదేశ్​లో కొన్ని రోజులుగా భారత వ్యతిరేక ఆందోళనలు, నిరసనలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశంలోని బలూకా ప్రాంతంలో దీపూ చంద్ర దాస్​(27) అనే వ్యక్తిని అల్లరిమూకలు దారుణంగా కొట్టి, చంపేసి, చెట్టుకు వేలాడదీసి తగలబెట్టారు. ఈ దురాగతంపై ఆవేదన వ్యక్తం చేస్తూ జాన్వీ కపూర్ తన ఇన్​స్టా అకౌంట్​లో పోస్ట్​ పెట్టారు. ​

‘దీపూ చంద్ర దాస్​’ అని పేరు పెట్టి ఆమె రాసిన పోస్ట్​లో ఏముందంటే.. “బంగ్లాదేశ్​లో జరుగుతున్నది అనాగరికం. ఇది క్రూరమైన హత్యాకాండ. అతని హత్య గురించి మీకు తెలియకపోతే తెలుసుకోండి. దాని గురించి చదవండి. వీడియోలు చూడండి. ప్రశ్నలు అడగండి. ఇవన్నీ చేసినా, చూసినా మీకు కోపం రాకపోతే అది కచ్చితంగా మనల్ని నాశనం చేసే హిపోక్రసీనే. ఒకపక్క మన సోదరులు, సోదరీమణులు తగలబడుతుంటే మనం మాత్రం ప్రపంచంలో ఇంకెక్కడో జరిగే సంగతుల గురించి ఏడుస్తుంటాం. మనం మానవత్వాన్ని మరచిపోకముందే మేలుకోండి.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా తిప్పికొట్టాలి. ఖండించాలి” అని పేర్కొన్నారు.

జాన్వీకపూర్​ (Janhvi Kapoor) పోస్టుపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మిగిలిన బాలీవుడ్​ నటులందరూ ప్రగతిశీల ముసుగువేసుకొని, కేవలం పాలస్తీనా మీద మాత్రమే స్పందిస్తుంటే జాన్వీ మాత్రం బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ధైర్యంగా తన అభిప్రాయం చెప్పిందని ప్రశంసిస్తున్నారు. ఈ మేరకు వివిధ సోషల్​ మీడియా ప్లాట్​ఫ్లామ్స్​లో కామెంట్లు చేస్తున్నారు. మతం పేరుతో హిందువులపై బంగ్లాదేశ్​లో జరుగుతున్న దాడులను, మారణహోమాన్ని ధైర్యంగా ప్రశ్నించిన జాన్వీని కొనియాడుతున్నారు. ‘జాన్వీ మంచి నటి కాకపోవచ్చు. కానీ, ఆమెకు తన చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలుస్తోంది. అంతేకాదు, వాటి గురించి ధైర్యంగా మాట్లాడుతోంది. ఇది కచ్చితంగా అభినందించాల్సిన విషయం.’ అని నెటిజన్లు అంటున్నారు. ‘‘కుడోస్​ జాన్వీ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also: ఒక్క నెలలోనే 91 లక్షల ఇండియన్ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>