Mobile Popup Ad
Mobile Popup Ad

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం భారీ ఊరట

కలం, వెబ్ డెస్క్ : పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ. 5 లక్షల వరకు అమౌంట్‌ను పొందేందుకు ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పద్దతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఈపీఎఫ్‌(EPFO)లో కొత్త డిజిటర్ వ్యవస్థ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఈపీఎఫ్‌లో కొత్తగా చేపట్టిన టెక్నికల్ మార్పుల వల్ల క్లెయిమ్ సెటిల్ మెంట్‌కు వారాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రోజుల్లోనే పని పూర్తి కానుంది.

అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరి పీఎఫ్ వివరాలను ఒకే డేటాబేస్ పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఏ ఈపీఎఫ్ (EPFO) ఆఫీసు నుంచైనా తమ వివరాలను సులభంగా చూసుకోవచ్చు. అలాగే జూలై 15 నాటికి పీఎఫ్ వడ్డీ జమ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు 34 కోట్ల వడ్డీ పీఎఫ్ ఖాతాల్లో జమ కానున్నాయి.

Read Also: కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాత సస్పెన్షన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>