ఏడేళ్లుగా ప్రేమ.. ప్రేయసి కోసం అర్ధరాత్రి ఊరిలో ఏం చేశాడంటే?

కలం, వెబ్ డెస్క్: కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక వింత ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రేమించిన యువతిని మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ ప్రేమికుడు తీవ్ర దుస్సాహసానికి ఒడిగట్టాడు. తమ ప్రేమ వివాహాన్ని పెద్దలు నిరాకరించారనే కక్షతో.. ఏకంగా ఆ అమ్మాయిని వివాహం చేసుకోబోయే యువకుడి సొంత ఊర్లోనే వాల్ పోస్టర్లు అంటించి కలకలం రేపాడు.

​తంగళ్లపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు, యువతి గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించకుండా, తంగళ్లపల్లికి చెందిన మరో వ్యక్తితో వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. పెళ్లి పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ​ఈ క్రమంలో సదరు ప్రేమికుడు పెళ్లి కొడుకు ఊరైన తంగళ్లపల్లి వ్యాప్తంగా అర్ధరాత్రి వేళ గోడలపై వాల్ పోస్టర్లు అంటించాడు. పోస్టర్లలో షాకింగ్ విషయాలు పేర్కొన్నాడు.

తమ ప్రేమ విషయం గురించి కాబోయే పెళ్లికొడుకుకు ముందే చెప్పినప్పటికీ కేవలం 16 తులాల బంగారం ఆశతోనే అతడు ఈ పెళ్లికి ముందుకు వచ్చాడని ప్రేమికుడు ఆరోపించాడు. అంతేకాకుండా, ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదని, తల్లిదండ్రులు బలవంతంగా ఒప్పించారని కూడా ఆ పోస్టర్లలో రాసుకొచ్చాడు. ​పెళ్లి కొడుకు గ్రామమంతటా ఏకపక్షంగా ఈ వాల్ పోస్టర్లు వెలియడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా అర్ధరాత్రి వేళ ఒక కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఈ పోస్టర్లను అంటించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సిసిటివి (CCTV) ఫుటేజ్ ప్రస్తుతం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

Read Also: జంటగా ఈషా రెబ్బా-తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>