కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) మరో కీలక మలుపు తిరిగింది. కేసీఆర్‌కు సిట్(SIT) అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు అనే వార్తపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే సీట్ నోటీసుల వార్తపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నాతో పాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతో పాటు ఎన్నో కుటుంబాల్లో చిచ్చుపెట్టారని మండిపడ్డారు. ఆఖరికి కన్న బిడ్డ, అల్లుడు ఫోన్లను కూడా ట్యాప్ చేసి నీచ రాజకీయాలకు తెర లేపారు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పటించారని వాపోయారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూళ్లు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయన్నారు.
కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటారా.?.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా..? అనే దానిపై బండి అనుమానం వ్యక్తం చేశారు. సంచలంనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ లా సాగదీస్తున్నారే తప్ప చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కేసు మొదలైన నాటి నుంచి వస్తున్న టీవీ సీరియల్స్ ఎపిసోడ్స్ కూడా అయిపోయాయే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా సాగుతూనే ఉందని ఎద్దేవా చేశారు. బడా పారిశ్రామికవేత్తలను, లీడర్లను, వ్యాపారాలను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బులు చేసిన వ్యవహారంపరైనా నిగ్గు తేల్చాలని.. అలాగే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయట పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా బండి సంజయ్(Bandi Sanjay) సిట్ అధికారులను డిమాండ్ చేశారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు..?
Follow Us On: X(Twitter)


