కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (phone tapping case) మరో కీలక మలుపుకు తిరగనుంది. కేసులో సజ్జనార్ నేతృత్వలోని సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్పై ఫోకస్ పెట్టారు. విచారణలో భాగంగా కేసీఆర్(KCR)కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే కేసీఆర్ తో పాటు హరీశ్ రావుకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది? ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది.
ఈ అంశాలపై స్పష్టతకు వచ్చిన సిట్(SIT), తదుపరి చర్యలకు ముందడుగు వేస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, తన వాంగ్మూలాల్లో పదే పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లు ప్రస్తావించడంతో.. ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ పూర్తిస్థాయిలో రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.


