Mobile Popup Ad
Mobile Popup Ad

12 మంది పిల్లలు. 5 పందులు.. విద్యారంగంపై కేటీఆర్ ట్వీట్!

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యారంగం(Education System)పై అవలంబిస్తున్న కాంగ్రెస్ వైఖరిని ట్విట్టర్(KTR Tweet) వేదికగా ప్రశ్నించారు. ‘తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దంపట్టే చిత్రం ఇది’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ‘మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్‌వాడీలో పందులు తిరుగాడుతుంటే, బిక్కుబిక్కుమంటూ భోజనం కోసం లైనులో విద్యార్థులు నిలబడ్డారు’ అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు.

‘‘కాంగ్రెస్ గద్దెనెక్కాక రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 102 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగాయి. 2188 పిల్లలు అసుపత్రుల పాలయ్యారు. వివిధ కారణాల వల్ల 118 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ (KTR Tweet) చేశారు.

Read Also: కేసీఆర్‎కు నోటీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>