కలం, వెబ్ డెస్క్ : పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో చెక్ డ్యామ్ లు(Check Dams) కూలిపోయిన ఘటనపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యామ్ లు ధ్వంసం అయిన ఘటనలపై ఆరా తీసిన మంత్రి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. చెక్ డ్యామ్ లు కూలిపోవడానికి నాసిరకం నిర్మాణం లేదా నాణ్యత లోపం కారణాలు అని తేలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
కావాలని ధ్వంసం చేసినట్లు తెలిసినా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని విజిలెన్స్ డిపార్ట్ మెంట్ అధికారులను ఆదేశించారు. రైతులకు మేలు చేసే చెక్ డ్యామ్ లను ధ్వంసం చేయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యామ్ల భద్రతపై నిఘా ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు.
Read Also: న్యూ ఇయర్ వేడుకలపై నిఘా.. నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
Follow Us On: Pinterest


