కలం, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్ (Office Space Leasing) మార్కెట్ మిశ్రమ ఫలితాలను కనబరిచింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా రెండు శాతం మేర క్షీణించి 17.4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. అయితే కొన్ని నగరాలు మంచి వృద్ధిని కనబరచగా, మరికొన్ని నగరాల్లో లీజింగ్ గణనీయంగా తగ్గింది.
ఐటీ, కార్పొరేట్ రంగాలకు హబ్‌గా ఉన్న బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్ నగరాలు ఈ త్రైమాసికంలో సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్ బలంగా పుంజుకుంది. గత ఏడాది (2025) ఇదే కాలంలో 3.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్న లీజింగ్, ఈ ఏడాది (2026) నాటికి 3.8 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఇది దాదాపు 19 శాతం వృద్ధిని సూచిస్తోంది. అలాగే బెంగళూరు 5.2 శాతం వృద్ధితో 5.2 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్‌ను నమోదు చేయగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ఏకంగా 23 శాతం వృద్ధితో 2.7 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్‌ను సాధించింది.
మరోవైపు ముంబయి, పుణె, చెన్నై, కోల్‌కతా వంటి ప్రముఖ నగరాల్లో కార్యాలయ స్థలాల డిమాండ్ తగ్గింది. ముంబయి నగరంలో లీజింగ్ 29 శాతం క్షీణించి 2.0 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. చెన్నైలో 23 శాతం, పుణెలో 25 శాతం మరియు కోల్‌కతాలో 17 శాతం మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో (Office Space Leasing) తగ్గుదల నమోదైంది. నగరాల వారీగా చూస్తే బెంగళూరు అత్యధిక లీజింగ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది.
Read Also: అమెరికా పౌరసత్వం వదిలి.. 94 ఏళ్ల బామ్మ సంచలన నిర్ణయం!
Follow Us On: Instagram

