Mobile Popup Ad
Mobile Popup Ad

మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్​..!

క‌లం, వెబ్ డెస్క్: ఇటీవల జైలు నుంచి విడుదలైన పోక్సో (POCSO) కేసు నిందితుడు బండి భగీరథ్​ (Bandi Bhagirath)ను పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో భగీరథ్​ను మే 16న పోలీసులు అరెస్ట్​ చేశారు. అప్పటి నుంచి చర్లపల్లి జైలులో రిమాండ్​ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో భగీరథ్ తనకు బీబీఏ​ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని, తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బెయిల్​ మంజూరు చేయాలని పిటిషన్​ దాఖలు చేసుకున్నాడు. జూన్​ 20న మేడ్చల్​ మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది. ఈ బెయిల్​ గురువారంతో ముగిసింది. దీంతో పోలీసులు భగీరథ్​ను అదుపులోకి తీసుకొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం భగీరథ్​ను చర్లపల్లి జైలుకు తరలించారు.

Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>