కలం, వెబ్ డెస్క్: నేడు డ్రగ్స్ వ్యతిరేక దినం (Anti Drugs Day) సందర్భంగా చెన్నైలో నిర్వహించిన మెగా మారథాన్‌లో సీఎం విజయ్ (CM Vijay) పాల్గొన్నారు. బీచ్ రోడ్డులో 6 కిలో మీటర్ల మేర 20 నిమిషాల పాటు ప్రజలతో పరుగెత్తారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ మారథాన్ నిర్వహించింది. ఇక సీఎం విజయ్ పాల్గొంటారని తెలియడంతో ప్రజలు, విజయ్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. విజయ్ యువతతో కలిసి ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నారు.
విజయ్ (CM Vijay) మార్గ మధ్యలో ప్రజలతో మాట్లాడారు. అభిమానులతో సెల్ఫీలు తీసుకున్నారు. విజయ్‌తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ మారథాన్‌లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేసి సంతకం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకున్నానని, ఎప్పటికీ మాదకద్రవ్యాలకు బానిస కాను అని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా వాటికి దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తామన్నారు. మాదక ద్రవ్యాల తయారీ, వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వానికి సహకరిస్తానన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి అండగా నిలుస్తూ, డ్రగ్స్ రహిత తమిళనాడు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Read Also: అమెరికా పౌరసత్వం వదిలి.. 94 ఏళ్ల బామ్మ సంచలన నిర్ణయం!
Follow Us On: Instagram

