కలం, వెబ్ డెస్క్ : సొంత గడ్డపై ఉన్న మమకారం, పుట్టిన నేలపై గల అనుబంధం ఎంతటివారినైనా కట్టిపడేస్తాయి. జీవిత చరమాంకంలో మాతృభూమి ఒడికి చేరుకోవాలనే ఒక వృద్ధురాలి సంకల్పం ప్రస్తుతం అందరినీ కదిలిస్తోంది. బాపట్ల (Bapatla) జిల్లాకు చెందిన 94 సంవత్సరాల మహాలక్ష్మమ్మ 2000 వ సంవత్సరంలో అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. అయితే, తన శేష జీవితాన్ని కన్ననేలపైనే గడపాలనే కోరికతో ఆమె తిరిగి భారతదేశానికి చేరుకున్నారు. తన చివరి శ్వాసను కూడా మాతృభూమిలోనే విడవాలనే భావనతో భారత పౌరసత్వం (Indian Citizenship) కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు.
తన అంత్యక్రియలు కూడా సొంత గ్రామంలోనే జరగాలని, వీలైనంత త్వరగా తనకు భారత పౌరసత్వం కల్పించాలని కోరుతూ మహాలక్ష్మమ్మ బాపట్ల (Bapatla) జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. 94 ఏళ్ల వయసులో మాతృభూమి పిలుపును అందుకుని ఆమె తీసుకున్న ఈ నిర్ణయం, స్వదేశంపై ఆమెకు ఉన్న భక్తిని చాటిచెబుతూ పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
మాతృభూమిపై వృద్ధురాలి ప్రేమ!
-అమెరికా పౌరత్వం వదిలి భారత్కు తిరిగి వచ్చిన 94 ఏళ్ల బామ్మ!
-భారతీయురాలిగానే తుదిశ్వాస విడుస్తాను అంటూ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న బాపట్ల జిల్లాకు చెందిన మహాలక్ష్మమ్మ
-2000 వ సంవత్సరంలో అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డ… pic.twitter.com/bXutR1gQaV— Kalam Daily (@kalamtelugu) June 26, 2026
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

