epaper
Friday, January 16, 2026
spot_img
epaper

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ ఇస్రో ఛైర్మన్

క‌లం వెబ్ డెస్క్‌: ఇస్రో ఛైర్మన్(ISRO Chairman) డాక్టర్ వి.నారాయణన్(Narayanan) సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ తిరుమల(Tirumala)లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 24వ తేదీన జరగనున్న ముఖ్యమైన రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఆయన ఈ దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇస్రో భారీ లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3-ఎం6 మిషన్ డిసెంబర్ 24న ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ మిషన్‌లో అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ కంపెనీకి చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 (బ్లూబర్డ్-6) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనున్నారు.

ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా హై స్పీడ్ సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే సాంకేతికతను కలిగి ఉంది. ఇస్రోలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ముఖ్యమైన ప్రయోగాలకు ముందు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ నారాయణన్(ISRO Chairman) శ్రీవారి దర్శనం చేసుకుని, ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు.

Read Also: నేడు టీటీడీ మార్చి నెల ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>