కలం వెబ్ డెస్క్ : మంచిర్యాల(Mancherial) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బొలెరో వాహనాన్ని ఓ లారీ అతివేగంతో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లో వరినాట్లు వేసేందుకు మంచిర్యాల నుంచి బొలెరో వాహనంలో కొందరు మహిళలు బయలుదేరారు. జైపూర్ మండలం శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ వద్ద వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 13 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా మహారాష్ట్రకు(Maharashtra) చెందినవారిగా గుర్తించారు. వీరు మంచిర్యాలలో(Mancherial) నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. బతుకుదెరువు కోసం వచ్చిన మహిళలు కూలీ పనికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: తాగి రోడ్డెక్కుతున్నారు.. 800 మంది మందుబాబులపై కేసులు
Follow Us On: Pinterest


