కలం, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల తెలంగాణ (Telangana)లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 31 జిల్లాల్లోని 564 మండలాల్లోని 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఉదయం 10. 30 గంటలకు కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ‘ఎక్స్’ వేదికగా విష్ చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం నిస్వార్ధంగా కృషి చేయాలని కవిత కోరారు.
Read Also: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్
Follow Us On: Instagram


