కలం, వెబ్డెస్క్: సమష్టి ప్రదర్శనతో భారత మహిళల జట్టు (India Women) తొలి టీ20లో గెలుపొందింది. ఆదివారం విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పర్యాటక జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో ఓపెనర్ విష్మీ గుణరత్నె(39; 43 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్. చమరి ఆటపట్టు(15), హాసిని పెరీరా(20), హర్షిత మాధవి(21) రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీ చరణి తలో వికెట్ తీశారు. లంక జట్టులో ముగ్గురు రనౌట్ కావడం విశేషం.
అనంతరం భారత్ 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి విజయం అందుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (65; 44 బంతుల్లో 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో జట్టును గెలిపించింది. ఓపెనర్ షఫాలీ వర్మ(9), మంధాన(25; 25 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15 నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కావ్య, రణవీర చెరో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల సిరీస్ (INDW VS SLW)లో భారత్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 ఇదే వేదికగా ఈ నెల 23న జరుగుతుంది.
Read Also: ఆ ఓటమితో క్రికెట్ మానేద్దామనుకున్నా: రోహిత్ శర్మ
Follow Us On: Sharechat


