నిజామాబాద్ ప్రజావాణికి 91 ఫిర్యాదులు

కలం, నిజామాబాద్ బ్యూరో :  ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ (Nizamabad) అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం (Prajavani Program) లో మొత్తం 91 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు వివరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. అందిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Read Also: ప్రధాని మోదీ ఆదేశం.. సౌదీ వెళ్లిన అజిత్ దోవల్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>