కలం, వెబ్‌డెస్క్: గొలుసు చోరీలు (Chain Snatchings) ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా మారుతున్నాయి. దొంగలు నిత్యం కొత్త ఎత్తుగడలతో అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బంగారం కోసం మహిళలపై దాడి చేయడం, చంపడం వంటి ఘటనలు కూడా ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం. ఇటువంటి దారుణమైన ఘటన రాజన్న సిరిసిల్లా (Rajanna Sircilla) జిల్లాలో చోటుచేసుకుంది.
ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలో ఓ మహిళ ముస్తాబాద్ వెళ్లేందుకు అటునుంచి వస్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి ఆ మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు. ఆమెను బైక్ ఎక్కించుకుని వెంకయ్యకుంట గ్రామ శివారుకు బైకును తీసుకెళ్లాడు. దీంతో అనుమానం వచ్చిన మహిళ విషయాన్ని గమనించేలోపే ఆ దుండగుడు ఆమెపై దాడి చేశాడు. ఆమె ధరించిన పూసల మట్టలు, చెవి పోగులు, ముక్కు పోగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలపాలైన ఆ మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Read : రొనాల్డో 969వ గోల్.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన అల్-నసర్
Follow Us On: Sharechat

