కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ప్రధాని మోదీ (Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ దేశాల్లో పర్యటించి.. అక్కడ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను (Ajit Doval) ఆదేశించారు. ఈ మేరకు సౌదీ అరేబియా వెళ్లిన దోవల్.. ఆ దేశ చమురు, విదేశాంగ మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాంతీయంగా శాంతి స్థాపనతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై సమీక్ష చేసినట్లు వివరించింది. మరికొన్ని రోజుల పాటు దోవల్ పర్యటన కొనసాగే అవకాశం ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది.
భారత నౌకపై కాల్పులు.. కేంద్రం అప్రమత్తం
గత శనివారం హర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) భారత నౌకపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. “ఇప్పటికే ఇరాన్ అంబాసిడర్, విదేశాంగ మంత్రితో మాట్లాడి భారత్ నిరసన తెలిపాం. చమురు, ఇతర నౌకల రవాణా భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని స్పష్టంగా చెప్పాం. ఈ విషయాన్ని ఇరాన్ అత్యున్నత నేతలకు వివరించాలని సూచించాం. ఈ విషయంలో ఇరు దేశాల అధికారులు నిరంతరం టచ్ లో ఉంటున్నారు” అని స్పష్టం చేశారు.
Read Also: కేసీఆర్ పర్యటనలో కలకలం.. గాలిలోనే హెలికాప్టర్ చక్కర్లు!
Follow Us On : WhatsApp

