హన్మకొండ(Hanamkonda)లో తీవ్ర విషాదం జరిగింది. తేజస్వీ హైస్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న సర్జీత్ ప్రేమ్ అనే విద్యార్థి అనుమానాస్పద రీతిలో మరణించాడు. కాగా పిల్లాడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే పాఠశాల సిబ్బంది.. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే బాలుడు బ్రెయిన్ డెడ్ అయి మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా తలనొప్పి కారణంగానే బాలుడిని తీసుకొచ్చినట్లు వైద్యులు చెప్పారు. ఎటువంటి లక్షణాలు లేకుండా బ్రెయిన్ డెడ్ ఎలా అయ్యాడంటూ, పాఠశాల ముందు విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాఠశాల దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ మేరకు సమచారం అందిన వెంటనే పోలీసులు పాఠశాల ముందు మోహరించారు.
Read Also: పార్కిన్ సన్స్‌ను ఎలా కంట్రోల్ చేయాలి?

