స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదన్న నిబంధనను తెలంగాణ మంత్రివర్గం(Telangana Cabinet) రద్దు చేసింది. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఈ మేరకు సెక్షన్ 21(3) నిబంధనను తొలగించడానికి మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలి? అన్న అంశంపై చర్చించారు. ఇందులో భాగంగానే అర్హులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండకూదన్న 30ఏళ్ల నిబంధనలకు స్వస్తి పలకాలను మంత్రి వర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించిందని సమాచారం. అయితే అతి త్వరలో ఈ నిబంధనను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: రేవంత్‌తో ఐఏఎస్ రిజ్వీ భేటీ..

