Mobile Popup Ad
Mobile Popup Ad

వైరల్ పోస్ట్‌కు స్పందన: ఆలయ అభివృద్ధికి డాక్టర్ సాయం!

కలం, నిర్మల్ : సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ పోస్టుకు స్పందించిన చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సంతోష్ రాజు ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించారు. నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామ సమీపంలో ఉన్న కర్నిగాడ్ వీర హనుమాన్ ఆలయానికి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే ఆలయం చిన్నదిగా ఉండటంతో అభివృద్ధి అవసరమని భావించిన చించోలి (బి) గ్రామానికి చెందిన రాకేష్ ఆలయం పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ పోస్టును చూసిన డాక్టర్ సంతోష్ రాజు స్పందించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, మంగళవారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చిన డాక్టర్ సంతోష్ రాజును గ్రామస్థులు, భక్తులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: స్కూల్ బస్సులు, ఆటోలపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్.. 67 వాహనాలు సీజ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>