Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూళ్ల రీ-ఓపెనింగ్ తేదీ మార్పు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన పాఠశాలల రీ-ఓపెనింగ్ (Telangana Schools Reopening) తేదీ మారింది. బడిబాట పట్టే రోజును ఈ నెల 15వ తేదీకి మారుస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అకడమిక్ క్యాలెండర్ 2026-27 ప్రకారం మొదట జూన్ 12న పాఠశాలలు తెరవాలని నిర్ణయించినప్పటికీ, పలువురి నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. జూన్ 13 రెండవ శనివారం, జూన్ 14 ఆదివారం కావడం వల్ల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను జూన్ 15వ తేదీ సోమవారం నాడు పునఃప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.

ఈ మార్పు కారణంగా కోల్పోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయడానికి, నిర్ణీత పనిదినాలను పూర్తి చేయడానికి విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో వచ్చే రెండవ శనివారం (జూలై 11వ తేదీ)ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సాధారణ పనిదినంగా ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులు (DEO) తమ పరిధిలోని పాఠశాలలకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>