నిమ్స్ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నూతన డైరెక్టర్‌ (NIMS Director)గా సీనియర్ యురాలజీ వైద్యులు డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నిమ్స్ యురాలజీ విభాగం ప్రొఫెసర్‌గా, హెచ్‌ఓడీగా సేవలందిస్తున్న డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్‌ను మూడేళ్ల కాలపరిమితికి డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 179 ద్వారా ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ గవర్నర్ పేరిట ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Read Also: తగ్గిన సాగు.. రాష్ట్రంలో కూరగాయల షార్టేజ్ ముప్పు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>