కలం, వెబ్ డెస్క్: దిల్లీలో నిన్న కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో అధ్యక్షుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నిన్న మేం చరిత్ర సృష్టించాం. జంతర్ మంతర్ దగ్గర ప్రశాంతంగా నిర్వహించిన ఈ ఆందోళన ట్రైలర్ మాత్రమే. కాక్రోచ్‌ల శక్తి ఏంటో ప్రభుత్వానికి తెలిసింది. నిన్న వచ్చినవారిలో చాలా మంది ఇంతకుముందెన్నడూ ఆందోళనలో పాల్గొనలేదు. భ్రష్టుపట్టిపోయిన విద్యా వ్యవస్థపై వారికి ఉన్న ఆగ్రహాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. మన గొంతును బలంగా వినిపించకపోతే.. మార్పు ఎన్నటికీ సాధ్యం కాదు. ఎండ వేడిమిని తట్టుకుని మరీ నిరసనలో పాల్గొన్న చిన్నారులు, విద్యార్థులు సహా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శాంతియుతమైన నిరసన మన బలమైన ఆయుధం. ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదు. మాకు వారిని భయపెట్టాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు’ అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాల్సిందే..
కాక్రోచ్ పార్టీ ఆందోళన నిన్నటితో ముగిసిపోలేదని అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక తరాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే వారం రోజుల్లోగా అతడిని కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవి నుంచి తొలగించకపోతే.. ఆందోళనలను క్షేత్ర స్థాయికి విస్తరిస్తామని హెచ్చరించారు. ఈ రోజు తాను ఇన్ స్టా లైవ్‌లో మాట్లాడుతానని తెలిపారు.
Read Also: నల్లగొండలో మిస్టరీ: ఒకే కుటుంబంలో నలుగురు అదృశ్యం!
Follow Us On: X(Twitter)

