న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. న్యూయార్క్ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారతీయ మూలాలున్న జొహ్రాన్ మమ్‌దానీ(Zohran Mamdani) గెలుచుకున్నారు. 34 ఏళ్ల వయసులోనే న్యూయార్క్(New York City) మేయర్‌గా ఎన్నికవడం గమనార్హం. ఈ ఎన్నికను రిపబ్లికన్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి చేశారు. ఎన్నికల ముందు రోజు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో ‘‘మమ్‌దానీ గెలిస్తే నగరానికి అవసరమైన కనీస నిధులకే పరిమితం అవుతాను. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి న్యూయార్క్ మేయర్‌గా రావడం నగరానికి ప్రమాదకరం’’ అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఓటర్లు ఆయన మాటలను పక్కనబెట్టి మమ్‌దానీకి తీర్పు ఇచ్చారు.
అమెరికాలోనూ ఫ్రీ బస్ హామీ
మమ్‌దానీ ప్రచారంలో ఇచ్చిన హామీలే ఆయన విజయానికి మూలకారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నగరంలో ఉచిత సిటీబస్సు ప్రయాణాలు, అద్దె స్థిరీకరణ, యూనివర్సల్ ఛైల్డ్ స్కీమ్ అమలు, 2030 నాటికి కనీస వేతనాల పెంపు, కార్పొరేట్లు, ధనవంతులపై పన్ను పెంపు వంటి హామీలు ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించాయి. జీవన వ్యయాలు పెరుగుతున్న న్యూయార్క్‌లో ఈ అంశాలు సాధారణ వర్గాలను, యువతను, వలస కార్మికులను బలంగా ఆకర్షించాయి.
ఎవరీ Zohran Mamdani
జొహ్రాన్ మమ్‌దానీ భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్, ఉగాండా ప్రొఫెసర్ మహమూద్ మమ్‌దానీ దంపతుల కుమారుడు కావడం విశేషం. మమ్ దానీకి చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి. తల్లిదండ్రుల పెంపకం కూడా అందుకు ప్రధాన కారణం. స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. న్యూయార్క్‌లో వలస కుటుంబాల సమస్యలను, అద్దె భారం, ఉద్యోగ భద్రత వంటి అంశాలను ప్రధాన అజెండాగా మార్చి ఆయన ప్రజల్లో చైతన్యం రేపారు.
Trump ప్రతిష్ఠకు గండం
మమ్‌దానీ విజయం ట్రంప్ వ్యక్తిగత ప్రతిష్ఠకే కాదు, రిపబ్లికన్ పార్టీకి కూడా పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా వలస నేపథ్యం ఉన్న యువ నేత ఎదుగుదల రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా రాజకీయాల్లో వైవిధ్యానికి, వలస మూలాలున్న నాయకుల ఎదుగుదలకు మమ్‌దానీ విజయం కొత్త దిశ చూపింది. కేవలం 34 ఏళ్ల వయసులోనే అతిపెద్ద నగరాన్ని నడిపే బాధ్యతలు స్వీకరించడం ఆయనకు చారిత్రాత్మక ఘనతగా నిలిచింది. జొహ్రాన్ మమ్‌దానీ గెలుపు అమెరికా రాజకీయాల్లో నూతన ఆలోచనలకు, సామాజిక న్యాయ సిద్ధాంతాలకు సంకేతంగా నిలిచింది.
Read Also: మైనర్లతో కేటీఆర్ ప్రచారం.. ఈసీకి ఫిర్యాదు
Follow Us on : Youtube

