జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పోటీ ఉన్నప్పటికీ బీజేపీ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నది. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో పర్యటించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదని.. 22 నెలల పాలనలో ఆ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలుకు ఏమీ చేయలేకపోయిందని అందుకే బీజేపీ మీద ఆరోపణలు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. .
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరి ప్రాంతంలో కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ప్రజలను కలుసుకుని, ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తోంది. మరో రెండు నెలల్లో రెండేండ్లు పూర్తి చేసుకుంటుంది. కానీ జూబ్లీహిల్స్‌తో పాటు హైదరాబాద్ నగరానికి గానీ, రాష్ట్రానికి గానీ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్లీ ఉపఎన్నికల్లో ప్రజల మనసులు మార్చేందుకు తప్పుడు హామీలతో వస్తున్నారు,” అని అన్నారు. తమ పార్టీకి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీకి మధ్య ఎలాంటి అవగాహన ఒప్పందం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. “మా పార్టీ స్పష్టమైన సిద్ధాంతాలపై నడుస్తుంది. కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వాస్తవానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే అవగాహన ఉంది. ప్రజలు ఈ రెండు పార్టీల మోసపూరిత రాజకీయాలను గుర్తించారు,” అని అన్నారు.
జూబ్లీహిల్స్‌లో ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, బీజేపీనే ఆ మార్పుకు ప్రతీకగా నిలుస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. “జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం, నిజాయితీ రాజకీయాల కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: న్యూయార్క్ మేయర్‌గా భారతీయ మూలాలున్న వ్యక్తి.. ట్రంప్‌కు గట్టి షాక్
Follow Us on : Youtube

