కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని (Vidadala Rajani) తన పాస్ పోర్ట్ ను పోలీసులకు అప్పగించారు. టీడీపీ నేత పిల్లి కోటి.. విడదల రజనితో పాటు మరికొందరిపై చిలకూలూరిపేటలో ఫిర్యాదు చేయగా వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లకూడదని, నరసరావు పేట డీఎస్పీ కార్యాలయంలో పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రజని డీఎస్పీ హనుమంతరావుకి తన పోస్ పోర్ట్ ను అధికారికంగా అప్పగించారు. కాగా, పోలీసులు ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు సమాచారం.
Read Also: మంత్రి నిమ్మల రామానాయుడుతో వైసీపీ నాయకుల వాగ్వాదం
Follow Us On: Instagram

