ఈసారి డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: ఈసారి తమ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో చేయబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెల్లడించారు. ఒక యాప్ ద్వారా సభ్యత్వ నమోదు జరుగుతుందని స్పష్టం చేశారు. బూత్‌కు ఇద్దరి చొప్పున యాప్ వాడకంపై శిక్షణ ఇస్తామని.. ఆ తర్వాత మెంబర్‌షిప్ కార్డులు ఇస్తామని వివరించారు. జూన్ నుండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. జూలై, ఆగస్ట్‌లలో కమిటీలు ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత పార్టీ శిక్షణా తరగతులు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ‘నా బూత్- నా భవిష్యత్’ కార్యక్రమంలో భాగంగా తమ పార్టీ బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు హాజరై దిశానిర్దేశం చేశారు.

పదేళ్లపాటు తెలంగాణలో కులం పేరిట, మతం పేరిట తాము ఎన్నడూ చిల్లర రాజకీయాలు చేయలేదని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిలా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు నడిపించామని వివరించారు. కానీ నేడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలను తామంతా ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో హైదరాబాద్, తెలంగాణ బాగుపడాలంటే.. మళ్లీ గులాబీ జెండా ఎగరాల్సిందేనని అన్నారు.

తెలంగాణలో ఎవరికి ఏ సమస్య ఒచ్చినా నిలబడేది బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే కాంగ్రెస్, బీజేపీ మౌనంగా ఉన్నా బీఆర్ఎస్ పోరాడిందని చెప్పారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి కుమ్మక్కైనా.. ఆ బాలిక తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదని చెప్పారు. కామాంధుడి చేతిలో విలవిలలాడిన ఆ అమ్మాయికి బీఆర్ఎస్ మహిళా విభాగం అండగా నిలబడిందన్నారు. తమ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, విద్యార్థి సంఘాలు, సోషల్ మీడియా వారియర్లు అమ్మాయి తరఫున పోరాడారని కొనియాడారు.

Read Also: విదేశీయుల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి ఏం నొప్పి?: కిషన్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>