Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో కోల్డ్ వార్.. ఒకేరోజు టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో పొలిటికర్ వార్ హీటెక్కింది. ఒకేరోజు పోటాపోటీ నిరసనలకు టీడీపీ, వైసీపీ పార్టీలు (TDP – YSRCP) పిలుపునిచ్చాయి. సరిగ్గా ఇదేరోజున రెండేళ్ల క్రితం వైసీపీ పార్టీ ఓటమి తరువాత కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. జూన్ 4, 2024న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలో వైసీపీ అక్రమాలు చేసిందని ఆరోపిస్తూ నిరసన గళం వినిపించాలని, గత ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ విధ్వంసాన్ని వివరిస్తూ నిరసనలు చేపట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. రాక్షస పాలన ముగింపుకు రెండేళ్లు పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించింది. అటు ప్రతిపక్ష వైసీపీ సైతం పోటాపోటీగా వ్యూహాలు రచించింది. రెండేళ్ల కూటమి ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. నేటి నుండి రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసనలు చేపట్టాలని కేడర్ ను ఆదేశించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

తమ పార్టీల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఉవ్వెత్తున ఉద్యమాలు చేపట్టాయి. ఎక్కడికక్కడ ధర్నాలతో టీడీపీ, వైసీపీ శ్రేణులు దూసుకెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన గుంటూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకే రోజు రెండు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ ఉద్యోగాల భర్తీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందంటూ ఫ్లెక్సీలతో గుంటూరులో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. గ్రూప్ -1 ఉద్యోగాలు అమ్ముకున్నది వైసీపీ నేతలే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించాలి అంటూ నినాదాలు చేశారు. అటు రెండేళ్ల కూటమి పాలనలోని అనేక లోపాలను విమర్శిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మరికాసేపట్లో ధర్నా చేసేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రానున్నారు. గుజ్జెనగొండ సెంటర్ వద్దకు టీడీపీ, వైసీపీ శ్రేణులు రానుండటంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగనుండటంతో ముందస్తుగానే పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా శాంతి, భద్రతలకు విఘాతం కలుగకుండా పర్యవేక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>