కలం, వెబ్ డెస్క్ : పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు, రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని వివిధ రిజర్వాయర్లు, పంపుహౌస్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం రెండు హెలికాప్టర్ల ద్వారా సీఎం ఏరియల్ సర్వేలు నిర్వహించనుండటం విశేషం.
పర్యటనలో భాగంగా మొదటి రోజు సోమశిలలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నీటిపారుదల ప్రాజెక్టులపై ఒక కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఈ రోజు రాత్రికి ఆయన సోమశిలలోనే బస చేస్తారు. ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించి, పనులను మరింత పరుగులు పెట్టించేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడనుంది. ఇక పర్యటన ముగింపు రోజైన రేపు ఉద్దండాపూర్‌లో (Uddandapur) సీఎం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని ఈ సభతో ముఖ్యమంత్రి తన రెండు రోజుల పాలమూరు పర్యటనను ముగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
Read Also: కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకో నీతి.. బాల్క సుమన్‌కు ఒక నీతా?: కేటీఆర్
Follow Us On : WhatsApp

