Mobile Popup Ad
Mobile Popup Ad

ఉపాధి హామీ కూలీలకు అండగా వైసీపీ ఉద్యమం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు అండగా నిలుస్తూ ఉద్యమం చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ (YSRCP) పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 27 ఉదయం 10 గంటలకు వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు. అనంతరం కలెక్టర్లకి విజ్ఞాపనా పత్రాలు అందజేయనున్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలని విడుదల చేయాల వైసీపీ డిమాండ్ చేస్తోంది. MGNRGES చట్టం ప్రకారం మౌళిక సదుపాయలు కూలీలకు కల్పించాలని.. ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

Read Also: ఏపీలో ఇంధనం కొరత.. మంత్రి నాదెండ్ల అల్టిమేటం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>