కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ పరిస్థితిపై మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla) ఆయిల్ కంపెనీలు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి చెప్పారు. అయితే కొంతమంది పెట్రోల్ బంకు యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వాహనదారులు ప్యానిక్ కావడం వల్ల అధికంగా కొనుగోలు చేయడంతోనే ఇంధన కొరత సమస్య వస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు ఉ. 6 లోగా అన్ని పెట్రోల్ బంకులు డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla) సూచించారు. ఆందోళన చెంది భారీగా కొనుగోలు చేయొద్దని కోరారు. డబ్బాలు, డ్రమ్ముల్లో వినియోగదారులకు సప్లై చేయొద్దని , అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఆదేశించారు. ఆయిల్ డిపోలను జిల్లా అధికారులు నిత్యం పరిశీలించాలన్నారు. ప్రైవేట్ ఆయిల్ కంపెనీల డిపోలు, అవుట్‌లెట్‌లను తనిఖీ చేయాలని ఆదేశించారు. బంక్‌ల వద్ద గొడవలు జరగకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
Read Also: ఉపాధి హామీ కూలీలకు అండగా వైసీపీ ఉద్యమం
Follow Us On: X(Twitter)

