ఏపీలో ఏ చిన్న అంశం అయినా ఎంత పెద్దగా రాజకీయ రచ్చగా మారుతుందో తెలిసిందే. అలాంటిది పవన్ కల్యాణ్ తెలంగాణ మీద చేసిన కామెంట్స్ ను వైసీపీ(YSRCP) విడిచిపెడుతుందా.. నెవ్వర్. కాకపోతే నేరుగా వైసీపీ రంగంలోకి దిగిపోకూడాదని భావిస్తోంది. తెలంగాణ ఇష్యూ కాబట్టి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), కేటీఆర్(KTR) స్పందించాలని ఆ తర్వాత తాము ఏకిపారేయాలని చూస్తోంది. కానీ వారిద్దరూ దీనిపై సైలెంట్ గా ఉంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో రేవంత్, కేటీఆర్ తర్వాతి స్థాయి నేతలు స్పందిస్తున్నారు. అంతేగానీ వారిద్దరూ ఎందుకో సైలెంట్ అయిపోయారు. వైసీపీకి కింది స్థాయి నేతల కామెంట్లు సరిపోవట్లేదు అనుకుంట.
అందుకే పూర్తి స్థాయిలో వైసీపీ(YSRCP) రంగంలోకి దిగట్లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) లాంటి వారు పవన్ మాటలను తప్పుబడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఏపీ పరువు తీస్తున్నాడని.. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాడని అంటున్నారు. కానీ వైసీపీ అసలు దృష్టి మాత్రం రేవంత్, కేటీఆర్ మీదనే ఉంది. వారిద్దరూ పవన్ కామెంట్స్ పై రియాక్ట్ అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోవాలని.. పవన్ ను టార్గెట్ చేసేసి ఏపీ రాజకీయాల్లో రచ్చ లేపాలని చూస్తోంది.
అసలే వైసీపీ నేతల మీద వరుస వివాదాలు, కేసులు నడుస్తున్నాయి. కాబట్టి పవన్(Pawan Kalyan) ఇష్యూ మంచి ఛాన్స్. దీన్ని వదులుకోడానికి వైసీపీ ఇష్టపడట్లేదు. కానీ కేటీఆర్, రేవంత్ స్పందించకుండా వైసీపీ నేతలందరూ పనిగట్టుకుని దీని గురించి మాట్లాడితే పస ఉండదు. అందుకే వెయిట్ చేస్తున్నారంట. నేడు కాంగ్రెస్ నుంచి మంత్రులు, టీపీసీసీ చీఫ్ స్పందించారు. రేవంత్ కూడా ఏమైనా రియాక్ట్ అయితే అప్పుడు వైసీపీ రంగంలోకి దిగొచ్చు.
Read Also: హిందూ దేవుళ్లపై రేవంత్ కామెంట్స్.. నెటిజన్ల ఫైర్
Follow Us on: Facebook


