ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) హిందూ దేవుళ్లపై చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హిందూ దేవుళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నడు. రెండు పెళ్ళిలు చేసుకునే వాళ్లకు ఒక దేవుడు ఉన్నడు. మాంసం తినేవాళ్లకు, తినని వాళ్లకు వేరే వేరే దేవుళ్లు ఉన్నారు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో విబేధాలు ఉండటం సహజమే అని చెప్పేందుకు ఆయన ఈ కామెంట్లు చేశారు. పార్టీలో ఎన్ని విబేధాలు ఉన్నా.. సీనియర్లు, జూనియర్లు అంతా కలిసి పనిచేసుకోవాలని ఆయన సూచించారు. డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలు విబేధాలు విడిచిపెట్టి కలిసి పనిచేసుకోవాలని సూచించేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
మొత్తం వీడియో పెట్టకుండా.. కేవలం రేవంత్ రెడ్డి(Revanth Reddy) దేవుళ్లకు సంబంధించి చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోలను మాత్రమే కడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ వీడియోలు బాగా వైరల్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా దేవుళ్లను కించపరిచినట్టు మాట్లాడలేదని.. హిందూమతంలో మూడు కోట్ల దేవతలు ఉన్నారు. భక్తులు ఎవరికి వారే ప్రత్యేకంగా దేవుళ్లను పూజించినప్పటికీ అంతా కలిసే ఉంటారని చెప్పడమే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని వారు అంటున్నారు. ఇక ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.
ఇటీవల దేవుళ్లకు సంబంధించిన చిన్న చిన్న అంశాలు కూడా తీవ్ర వివాదంగా మారుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి హనుమంతుడి మీద చేసిన కామెంట్లు, యాంకర్ శివజ్యోతి తిరుమలలో ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అయితే మరి రేవంత్ రెడ్డి కామెంట్లు కూడా అలాగే సంచలనంగా మారుతాయా? లేదంటే ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా.. అన్నది వేచి చూడాలి.
Read Also: బీజేపీని నేలమట్టం చేస్తాం -సీఎం రేవంత్ రెడ్డి
Follow Us on: Facebook


