షాకింగ్.. భారత్ లో భారీగా పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు

కలం, వెబ్ డెస్క్: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం (Iran – Israel Conflict) తీవ్రతరం అవుతున్న వేళ దేశంలో చమురు కొరత ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే అంచనాలు వెలువడగా.. ఆ అంచనాలను నిజం చేస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు పవర్ పెట్రోల్ ధరలను (Petrol Prices) పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ పవర్ పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచినట్లు ప్రకటించింది. అటు ప్రీమియం పెట్రోల్ పై లీటర్ కు రూ.2.30 పెంచినట్లు IOCL సంస్థ తెలిపింది. ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్ కు రూ.22కు పెంచినట్లు వెల్లడించింది. దీంతో ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్ ధర ఏకంగా రూ. 87.57 నుంచి రూ.109.59కి పెరిగింది. సవరించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

అయితే సదరు చమురు మార్కెటింగ్ సంస్థలు సాధారణ పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. సాధారణ పెట్రోల్ ధరను యథాతథంగా ఉంచడం ద్వారా సాధారణ వాహనదారులకు బిగ్ రిలీఫ్ దక్కింది. అయితే భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల మార్పులను బట్టి మరిన్ని ధరల సవరణలు జరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. భవిష్యత్ లో సాధారణ పెట్రోల్ ధరలను (Petrol Prices) కూడా పెంచే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.

Read Also: చైనా మరో ఆవిష్కరణ.. రోడ్డెక్కిన సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటీలు, ఇక నో డ్రైవర్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>