కలం, వెబ్ డెస్క్ : మానవత్వంతో వ్యవహరించాల్సిన చోట రాజకీయాలు చేయడం తగదని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ (YS Jagan) అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అలాగే, సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ఆపింది అని చెప్పుకొచ్చారు. ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతవరకు కార్మికులకు ఇబ్బందులు లేవని గుర్తు చేశారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తు ఆనాడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్లాంట్ కార్మికులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో వ్యహరించాలని జగన్ విజ్ఙప్తి చేశారు.

